High Court Send Notice to Ronanki Gopala Krishna

సివిల్స్ టాపర్.. మూడో ర్యాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణకు షాక్. హైకోర్టు నోటీసులు ఇచ్చింది. UPSC, కేంద్ర, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు ఇచ్చింది. దివ్యాంగుల కోటా కింద ఎంపిక కావటాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్ కు చెందిన లాయర్ పిల్ వేశారు. ఓబీసీ కోటా కింద గోపాలకృష్ణ తన చేతికి 45శాతం వైకల్యం ఉన్నట్లు UPSCకి సర్టిఫికెట్ దాఖలు చేశారు. ప్రిలిమ్స్ లో 91:34శాతం మార్కులు సాధించిన రోణంకి ఓబీసీ కేటగిరీ కింద కాకుండా.. దివ్యాంగుల కోటాలో 75:34శాతం మార్కులతో అర్హత సాధించటాన్ని పిటీషనర్ పేర్కొన్నారు. సాధారణ అభ్యర్థులకు మెయిన్స్ లో పరీక్షా సమయం మూడు గంటలు కాగా.. దివ్యాంగ అభ్యర్థులకు నాలుగు గంటల సమయం ఉంటుందని పిటీషనర్ తెలిపాడు. రోణంకి దివ్యాంగ సర్టిఫికెట్ పైనా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ర్యాంకర్ గోపాలకృష్ణతోపాటు కేంద్రం, ఏపీ రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం, యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీకి మంగళవారం (జూన్ 27) నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా పిటీషనర్ లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది కోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *